అల్పపీడనం పట్ల అప్రమత్తంగా ఉండలి..


Ens Balu
3
Visakhapatnam
2021-08-17 15:41:57

అల్పపీడనం ఏర్పడడంతో రానున్న 2, 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జివిఎంసి కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె 3, 4వ జోన్ల పరిధిలోని పాండురంగా పురం, ఆర్. కె. బీచ్, ఫిషింగ్ హార్బర్, పాత పోస్టాఫీసు, ఇందిర ప్రియదర్శిని స్టేడియం రోడ్డు, కాన్వెంట్ జంక్షన్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనంతో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడా గెడ్డలు, కాలువలు పొంగకుండా వాటిలోని వ్యర్దాలను తొలగించాలని, కాలువలు శుభ్రంచేసిన వెంటనే కాలువలపై కప్పులు మూయాలని ఆదేశించారు. పాండురంగాపురం పరిధిలో కేబుల్ వైర్లు చాల చోట్ల అస్తవ్యస్తంగా కింద పది ఉన్నాయని, వీటిని వెంటనే తొలగించాలని, డిప్లోయ్మెంట్ ప్లాన్ ప్రకారం పారిశుధ్య కార్మీకులకు సర్దుబాటు చేసి, ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని శానిటరీ సూపర్వైజర్ను ఆదేశించారు. చాల చోట్ల, చెట్ల కొమ్మలు పడియున్నాయని,   బహిరంగ ప్రదేశాలలో చెత్త కుప్పలు అధికంగా కనిపిస్తున్నాయని వాటిని యుద్ద ప్రాతిపదికన తొలగించాలని, రాత్రిలు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసిన వాహనాలు కింద చెత్త అధికంగా ఉంటుందని, వాటిని శుభ్రం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాదికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శివప్రసాద్, కార్య నిర్వాహక ఇంజినీరు  చిరంజీవి, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్  తదితరులు పాల్గొన్నారు.