పెండింగు దరఖాస్తులను పరిష్కరించండి..


Ens Balu
2
GVMC office
2021-08-17 15:49:12

పెండింగు లో ఉన్న స్పందన గ్రీవెన్స్ దరఖాస్తుల సర్వీస్ రిక్వెస్ట్ ను వెంటనే పరిష్కరిం చాలని ముఖ్య మంత్రి కార్యదర్శి సోల్మన్ ఆరోగ్య రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి కార్యదర్శి, జాయింట్ కలెక్టర్లు, అందరు మున్సిపల్ కమిషనర్లతో,  “సిస్కో వెబెక్ష్”  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగు లో ఉన్న ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ఏ ఏ స్థాయిలో పెండింగు లో ఉన్నాయో, పరిశీలన చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు. అన్ని సంక్షేమ పధకాలు అందరికి సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సంక్షేమ పధకాలు ఆన్లైన్లలో పొందు పరిచే సమయంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా లేదా అని తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలియజేశారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన బదులిస్తూ జివిఎంసి పరిధిలోని పెండింగు లో ఉన్న అన్ని ఆర్జీలను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అని తెలియజేశారు.