థర్డ్ వేవ్ కి ముందస్తు చర్యలు చేపట్టండి..


Ens Balu
1
GVMC office
2021-08-17 16:04:01

కోవిడ్ మహమ్మారి మూడవ దశ వ్యాప్తికి ఇప్పటినుండే ప్రత్యేక చర్యలు చేపట్టాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జివిఎంసి సమావేశ మందిరంలో డా. జి. సృజనతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ విస్తృతంగా వ్యాక్సినేషన్ వేయించాలని, కోవిడ్ పరీక్షలు చేసి వ్యాధి సోకిన వారికి ప్రత్యేకమైన వైద్యం అందించాలని, జివిఎంసి పరిధిలో ఉన్న అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని, కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ అయిన రోగిని హాస్పిటల్ కి తరలించుటకు 108, 104 వాహనాలను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, వార్డుల వారీగా కంటైన్మేంట్ జోనులు ఏర్పాటు చేయాలని, బరియల్ గ్రౌండ్లో అందరికీ తెలిసే విధంగా దహనానికి అయ్యే ఖర్చులను నోటీస్ బోర్డ్ లో పెట్టాలన్నారు. జోనల పరిధిలోని హాస్పిటల్స్, వెంటిలేటర్లు, బెడ్డులను గతం కంటే అధికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హైపోక్లోరైట్, బ్లీచింగ్, శానిటైజర్లు వంటివి నిల్వ చేసుకోవాలని, సీజనల్ వ్యాధులు అయిన మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టాలని, అందుకు ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఫీవర్ సర్వే ఆపకుండా నిరంతరం సర్వే చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ ఎ.వి.రమణి, డి.ఎం.ఒ.హెచ్. డా. సూర్యనారాయణ, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి .శాస్త్రి, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, కోవిడ్ నోడల్ ఆఫీసరు డా. మురళి మోహన్, సిసిపి. విద్యుల్లత, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు,  పి.డి.(యు.సి.డి.) వై.ఎస్.ఆర్. శ్రీనివాస రావు, చీఫ్ వెటర్నరి డా. కిషోర్, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు