సింహాచలం శ్రీశ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న) స్వామి వారికి రాష్ట్ర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వెంకటేశ్వరావు రూ.2.276లక్షలు విరాళంగా సమర్పించారు. దాత తల్లిండ్రులు కొల్లా చిన్న, చిన్నమ్మడులు పేరిట అన్నదానం చేయాలని కోరారు. ఆ చెక్కును అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో చందన సమర్పణకు కలిపి ఆ మొత్తాన్ని సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకొని మొక్కలు తీర్చుకున్నారు. వీరితో పాటు మరికొందరు భక్తులు చందన, అన్నప్రసాదం కు విరాళాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హేమంత్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అలయ అర్చక స్వాములు పాల్గొని స్వామివారి పూజలు నిర్వహించారు.