జెర్సీ కోడెదూడలను వదిలిపెడితే చర్యలు..


Ens Balu
4
Simhachalam
2021-08-18 14:11:43

పాలుతాగే జెర్సీ కోడెదూడలను రైతులు వదిలించుకోవాలన్న ఉద్దేశంతో వాటిని తొలి పావంచ దగ్గర విడిచిపెట్టడం మహాపాపమని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. సింహాచలం కొండకింద తాత్కాలిక షెల్టర్ లో ఉంచిన జెర్సీ, సంకరజాతి కోడెదూడలను మంత్రి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లి నుంచి లేలేత దూడలను వేరుచేయడం సరికాదని..  ఇకపై అలాంటివాటిని తీసుకొస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. సింహాచలం చుట్టుపక్కలా చెక్ పోస్టులు పెట్టి వాటిని ఎవరైనా తీసుకొస్తే వెనక్కి పంపాలని సూచించారు. జబ్బుతో ఉన్నవాటిని తీసుకురావడం మహో ఘోరమన్నారు. దేవునికి నైవేధ్యం పెట్టేటప్పుడే ఎంతో జాగ్రత్తగా ఉంటామని అలాంటిది మొక్కుబడులు తీర్చుకోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు సూచించారు. ఇంట్లో జబ్బుతో ఉన్నమనిషుంటే బయట పారేస్తామా అంటూ ప్రశ్నించారు.  గోవులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న మంత్రి గోవులను  కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. కాశీవెళ్లి గంగలో మునిగినప్పుడు మనకిష్టమైనవి వదిలేస్తామని కష్టమైనవికాదన్నారు. అలాంగే వదింలించుకోవాలనుకున్న సంకరజాతి, జబ్బుతో ఉన్న లేగదూడలను వదిలించుకోవడం సరికాదన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దేశవాళి ఆవులనే శ్రీ సింహాద్రి అప్పన్నస్వామికి మొక్కులుగా సమర్పించాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.  ముందుగా మనిషినని.. తర్వాత అప్పన్నస్వామి భక్తుడినని.. ఆ పైనే మంత్రినని చెప్పుకొచ్చారు అవంతి. గోవులు, దేవాలయానికి చెందిన ఏ విషయంపైనైనా స్పందిస్తానన్నారు.  గోవుల విషయంలో పోలీసు, దేవస్థానం, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు.  జెర్సీ కోడెదూలను విడిచిపెట్టరాదంటూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు.