హడ్కో కాలనీలో గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్..
Ens Balu
2
Srikakulam
2021-08-18 14:15:07
పరిశుభ్రమైన శ్రీకాకుళం నగరం ఆవిష్కృతం కావాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు పిలుపునిచ్చారు. 47 వ డివిజన్ హడ్కో కాలనీలో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఓబులేసు బుధవారం హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తమ వీధివాడలతో సహా నగరాన్ని పరిశుభ్రముగా ఉంచుటకు సహకరించాలని కోరారు. నగరంలో తడి, పొడి చెత్త, ఇతర వృధా పరికరాలను వేయుటకు మొత్తం మూడు రంగుల బట్టలను సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది జ్ఞానేశ్వర్, రామినాయుడు, వాలంటీర్స్ సాహు, చిరంజీవి,ధనలక్ష్మి, దివ్య , మాజీ కౌన్సిలర్ ఏ. రామ్మోహన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.