ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ముందు ఉండాలి..


Ens Balu
5
Srikakulam
2021-08-18 14:31:32

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో శ్రీకాకుళం జిల్లా ముందు ఉండాలని జిల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సంబంధిత అధికారులతో బుధ వారం కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జిఎస్టి, కర్మాగారాలు, బాయిలర్లు, భూగర్భ జలవనరులు, డ్రగ్స్, మునిసిపాలిటీ, రెవిన్యూ, పరిశ్రమలు, కార్మిక శాఖ, పర్యాటక, పట్టణ ప్రణాళిక, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలు వీటిలో ప్రధానంగా భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు. ఈ శాఖల క్రింద 402 విభాగాల వినియోగదారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ఎంత సులభంగా సేవలు పొందవచ్చు అనే విషయంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఆగస్టు చివరి వారంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కార్యాలయానికి భౌతికంగా రాకుండానే దరఖాస్తు చేయడం, సంబంధిత పత్రాలు పొందడం జరగాలని ఆ విధానం ఏ మేరకు ఉపయుక్తంగా ఉందో పరిశీలించాలని ఆయన అన్నారు. విధానాల్లో మంచి మార్పులకు సూచనలు స్వీకరించాలని వాటిని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరుగుతోందని ఆయన వివరించారు. మంచి విధానాల సూచనలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇంకా మెరుగు పడుటకు అన్ని చర్యలు తీసుకోవాలని, జిల్లా ఆదర్శవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.ఉమామహేశ్వర రావు, జిఎస్టి సహాయ కమీషనర్ రాణి మోహన్, జిల్లా అగ్ని మాపక అధికారి సి.హెచ్.కృపావరం, కార్మిక శాఖ ఉప కమీషనర్ ఎస్.డి.వి ప్రసాద రావు, జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ, పర్యావరణ ఇంజినీర్ ఎస్.శంకర నాయక్, కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్. సత్యనారాయణ, భూగర్భ జల వనరుల శాఖ ఎడి లక్ష్మణ రావు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.