న్యాయ సలహా మేరకే దుకాణాలు అప్పగింత..


Ens Balu
3
Visakhapatnam
2021-08-18 14:34:21

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం బుధవారం స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జరిగింది.  143 దుకాణాలను గుత్తేదారులకు ఇచ్చే అంశంపై వాయిదా వేశామని తెలిపారు.  ఈ అంశంపై న్యాయ సలహా కోరామని,  న్యాయ సలహా వచ్చిన తర్వాత ఆయా దుకాణాలను గుత్తేదారులకు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.  143 దుకాణాలు నుండి తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిలు గుత్తేదారులు నుండి వసూలు చేయాలని స్థాయి సంఘం నిర్ణయించిందని,  నిధులు వసూలు అయిన తర్వాత  న్యాయ సలహా, స్థాయి సంఘం సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని అంతవరకూ ఈ అంశము వాయిదా వేస్తున్నట్లు చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ సమావేశంలో స్థాయి సంఘ సభ్యులు, అదనపు కమిషనర్ అవ్వారి వెంకట రమణి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, డి.సి.(రెవెన్యూ) పి. నల్లనయ్య, కార్యదర్శి లావణ్య, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.