19 సాయంత్రం వరకూ ఆగ్రి గోల్డ్ నమోదు..
Ens Balu
2
Srikakulam
2021-08-18 15:02:21
అగ్రి గోల్డ్ స్కీం లో డబ్బు చెల్లించిన ఒరిజినల్ రసీదు ఉన్నవారు గడువు లోపు నమోదు చేయించుకొలేని వారు లేదా గ్రామ వలంటీర్లు డేటా ఎంటర్ చేయకుండా ఉన్నవారు సమీప ఎంపీడీఓ కార్యాలయాలలో తమ డాక్యుమెంట్లు ఇవ్వవచ్చని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వటం జరిగిందనీ ఆయన చెప్పారు. తరువాత ఎట్టి పరిస్థితుల్లోను కొత్త దరఖాస్తులు అంగీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.