గ్రామసచివాలయ సేవలు వేగం పెరగాలి..


Ens Balu
3
Kakinada
2021-08-19 15:21:53

గ్రామ/వార్డు సచివాలయాల పనితీరు, అందుతున్న సేవలు మరింత పెరగాలని  రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయల ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ కలెక్టర్లకు సూచించారు. గురువారం ఈ మేరకు సచివాలయల ద్వారా అందిస్తున్న సేవల వివరాలు, ఇతర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏ జిల్లాల్లో ఏ విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.  కాకినాడ కలెక్టర్  క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రామ/ వార్డు సచివాలయల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను  వివరించారు. సచివాలయం ద్వారా బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫించన్ కార్డుల నిమిత్తం అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ సి.హరికిరణ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ కు వివరించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి,ఇతర అధికారులు పాల్గొన్నారు.