పరిసరాల పరిశుభ్రతతో దోమలు దూరం..


Ens Balu
2
Vizianagaram
2021-08-19 15:32:15

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల నివారణ చేయాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎల్.రాం మోహన్ పిలుపు నిచ్చారు.  ఆగస్ట్ 20 న శాస్త్ర వేత్త, బ్రిటిష్  వైద్యాధికారి   సర్ రోనాల్డ్  రాష్ జన్మ దినం సందర్బంగా  అంతర్జాతీయ దోమల దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు.  గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లా మలేరియా అధికారి డా.తులసి తో కలసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. అంతర్జాతీయ దోమల దినోత్సవం సందర్బంగా  ప్రతి పి.హెచ్.సి పరిధి లో ర్యాలీ లను నిర్వహించి గ్రామాల్లో దోమల నివారణ పై అవగాహన కల్పించడం జరుగుందన్నారు. దోమల వలన  కలిగే వ్యాధులు, వ్యాధి లక్షణకు, తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటి వద్ద, పరిసరాల్లో, కార్యాలయాల్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని,  దోమలు లేకుండా చేయడమే కాక,  వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే తగు పరీక్షలు  చేయించుకోవాలని అన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని,  దోమల పై అశ్రద్ధ పనికిరాదని అన్నారు.