కోవిడ్ నిబంధనలతోనే పండుగలు జరుపుకోవాలి..


Ens Balu
3
Vizianagaram
2021-08-19 16:03:45

విజయనగరం జిల్లాలో రాబోయే పండగలన్నిటిని కోవిడ్ తగ్గే వరకు కోవిడ్ నిబంధనల ననుసరించి జరుపుకోవాలని జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో  మైనారిటీ సంక్షేమ శాఖ వారు ముద్రించిన నో మాస్క్ – నో  ఎంట్రీ నినాదం తో ఉన్న పోస్టర్లను ఆవిష్కరించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ  ముస్లిం సోదరులకు మొహరం శుభాకాంక్షలు తెలియజేసారు.  శుక్రవారం  ముస్లిం సోదరులు  జరుపుకునే మొహరం పండగను  భక్తి శ్రద్ధలతో కోవిడ్ నడుమ జరుపుకోవాలని అన్నారు.  వ్యక్తుల మధ్య కనీసం  6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని,  అలింగానాలు వద్దని అన్నారు.  ప్రతి ఒక్కరు మాస్క్ వినియోగించాలని, శానిటైజర్  వాడాలని సూచించారు.   రోజు రోజుకు కోవిడ్ కేసు లు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు.  పాఠశాలలు తెరుచుకున్నాయని, పిల్లలకు  కోవిడ్ సోక కుండా జాగ్రత్తలు  తీసుకోవాలని అన్నారు.  కోవిడ్ నియంత్రణ కు  ప్రజలంతా సహకరించాలని  విజ్ఞప్తి చేసారు.  ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి.కిషోర్ కుమార్, జే. వెంకట  రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  మైనారిటీ సంక్షేమ అధికారి అరుణ కుమారి , ముస్లిం సోదరులు పాల్గొన్నారు.