రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్ర, శనివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. పురపాలక మంత్రి గురువారం సాయంత్రం 5 గంటలకు విశాఖ చేరుకొంటారు. శుక్రవారం రోజంతా జామి, గంట్యాడ, గుర్ల, చీపురుపల్లి మండలాల్లో పర్యటించి గ్రామ సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్ర భవనాలు, నాడు - నేడు కింద ఆధునీకరించిన పాఠశాలలను, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. 20వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు జామి మండలం విజినిగిరిలో గ్రామ సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. 11-30 గంటలకు గంట్యాడ మండలం కొర్లాంలో గ్రామ సచివాలయ భవనాన్ని, రైతుభరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు గుర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పేటలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంటలకు చీపురుపల్లి మండలం వంగపల్లిపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ భవనాన్ని ప్రారంభిస్తారు. 4.00 గంటలకు చీపురుపల్లి మండలం పేరిపిలో నాడు - నేడు కింద ఆధునీకరించిన పాఠశాలను ప్రారంభిస్తారు. 21వ తేదీ శనివారం నాడు స్థానికంగా ఏర్పాటైన కార్యక్రమాల్లో పాల్గొని విశాఖ వెళతారు. సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు.