పేదవిద్యార్ధికి ఇంగ్లీషు మీడియం విద్య..
Ens Balu
13
భూర్జ
2021-08-19 16:49:55
పేదవిద్యార్ధికి మన బడి నాడు - నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ఇంగ్లీష్ మీడియం విద్యను జగనన్న ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గవర్నమెంట్ స్కూల్ ముందు సీటు కోసం క్యూ కడుతున్నారంటే ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పీకర్ అన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బూర్జ మండలం కొల్లివలస కేజీబీవీ పాఠశాల, బాలయోగి గురుకుల పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతారాం గురువారం పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. కేజీబీవీ స్కూల్, బాలయోగి గురుకుల పాఠశాలలో నాడు - నేడు పనుల నాణ్యత ముఖ్య మంత్రి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని స్పీకర్ తమ్మినేని ఆన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి రాంబాబు, మండల అధికారులు, స్థానిక నాయకులు ఖండపు గోవిందరావు, బెజ్జిపురపు రామారావు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.