సింహాద్రి అప్పన్నకు డిఆర్డీఓ చైర్మన్ పూజలు..


Ens Balu
2
Simhachalam
2021-08-20 05:04:45

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, శాస్త్రవేత్త చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు.  ఆలయంలోని (శివాలయం) కాశీ విశ్వేశర ఆలయంలోనూ పూజలు చేసారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.