అప్పన్నకు సెంట్రల్ ఫైనాన్స్ జెసి పూజలు..
Ens Balu
3
సింహాచలం
2021-08-20 07:23:09
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని సెంట్రల్ ఫైనాన్స్ జాయింట్ కమిషనర్ ఎంఆర్ హర్షవర్ధన్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించు కున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.