శబ్ద కాలుష్యం లేని ఆటోలు నడపాలి..


Ens Balu
3
Srikakulam
2021-08-20 09:47:58

శ్రీకాకుళం నగరంలో శబ్ద కాలుష్యాన్ని వెదజల్లుతూ లౌడ్ స్పీకర్లతో తిరుగుతున్న ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, ట్రాఫిక్ డిఎస్పీ సి.హెచ్.జి వి.ప్రసాద్ ఆదేశాలు మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాల్లో లౌడ్ స్పీకర్ లు ఏర్పాటు చేస్తూ శబ్ద కాలుష్యం కలిగిస్తున్న ఆటో డ్రైవర్లకు,  ఇతర వాహనాల డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పలు ఆటోలకు అమర్చిన లౌడ్ స్పీకర్లను తొలగించారు. ట్రాఫిక్ యస్ ఐ లక్షణ రావు మాట్లాడుతూ పర్యావరణ హితాన్ని కోరుతూ శబ్ద కాలుష్యం చేసే ఆటోల పై చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు శాఖ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ స్వచ్ఛ శ్రీకాకుళం సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్లు హేమచంద్ర , జనార్దన్, హోమ్ గార్డ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.