ఏకలవ్య పాఠశాలలు త్వరగా పూర్తి చేయాలి..


Ens Balu
2
Srikakulam
2021-08-21 17:04:06

శ్రీకాకుళం జిల్లాలోని ఐ.టి.డి.ఎ పరిధిలో చేపడుతున్న ఏకలవ్య పాఠశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ­పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాల జిల్లా స్థాయి కమిటీ సమావేశం సీతంపేట ఐ.టి.డి.ఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏకలవ్య టీచర్ల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బడ్జెట్ నిధులు విడుదల కోసం డైరెక్టర్ కు లెటర్ రాయాలని కలెక్టర్ సూచించారు. తొలుత ఏకలవ్య పాఠశాలల తరగతులు జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్న ఆయన ఉపాధ్యాయులకు అవసరమయ్యే శిక్షణను ఇప్పించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీలో ఉన్న ఎడ్యుకేషన్ ప్రతినిధులు వారి పరిధిలోని పాఠశాలను తనిఖీ చేయాలని సూచించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మిపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.చంద్రనాయక్, ఇన్ ఛార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సర్వ శిక్షా అభియాన్ ప్రోజెక్ట్ అధికారి యస్.తిరుమల చైతన్య, డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆచార్య బిడ్డిక అడ్డయ్య, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల, ఐ.టి.డి.ఎ ఓ.ఎస్.డి యుగంధర్, ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాసులు, వి.సుబ్రమణ్యం, గురుకులం సెల్ ఇన్ ఛార్జ్ వెంకటేశ్వర్లు, కమిటీ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.