రోడ్డు పనులను సత్వరమే పూర్తిచేయాలి..
Ens Balu
8
Srikakulam
2021-08-21 17:11:32
శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ అధికారి ఛాంబరులో జిల్లాలోని రోడ్డు పనులపై శనివారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానంలో RWS శాఖ ప్రతిపాదించిన 19 రోడ్లలో 13 రోడ్లకు ఆమోదించడం జరిగిందన్నారు. ఆ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన 6 రోడ్లకు సర్వే చేసి అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా ఐ.టి.డి.ఎ పరిధిలో చేపడుతున్న 3 రోడ్లలో 1 రోడ్డు ఆమోదించడం జరిగిందని, మిగిలిన 2 రోడ్లకు కూడా సర్వే చేసి అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా అటవీశాఖాధికారి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.