చింతపల్లి బీచ్ రిసార్ట్స్ అభివృద్ధికి చర్యలు..


Ens Balu
2
Vizianagaram
2021-08-22 15:32:50

విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలం చింతపల్లి లో బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి కి  ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి   పర్యాటక శాఖ అధికారులని ఆదేశించారు. ఆదివారం  కలెక్టర్ తీర ప్రాంతాలైన  కోనాడ, తిప్పలవలస, బిజిపేట, చింతలవలస లో పర్యటించి  రిసార్ట్స్ ను సందర్శించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ చింతపల్లి రిసార్ట్స్  ఆధునీకరణకు త్వరగా ఒక  కార్యాచరణ ప్రణాళికలను తయారు చేసి పంపాలన్నారు.  బిజిపేట, తిప్పలవలస  మత్స్యకార నాయకులు కలెక్టర్ ను కలసి  ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ స్థానిక శాసన సభ్యులు తో మాట్లాడి తగు నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని అన్నారు.  ఈ పర్యటనలో  తహసీల్దార్  కృష్ణ మూర్తి,  ఏ.పి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్  ప్రతినిధులు శుభ్రమణ్యం,  మత్స్యకార నాయకులు  చిన్నప్పన్న , స్థానిక  మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.