టంగుటూరి భారత దేశానికే ఆదర్శం..
Ens Balu
3
Kakinada
2021-08-23 07:41:40
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి తరానికి స్పూర్తిదాయకని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కొనియాడారు. సోమవారం ఉదయం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర వేడుకగా స్థానిక జడ్పి ఆఫీసు కూడలి వద్ద నున్న అమరజవాన్ ట్రయాంగిల్ లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిలా కలెక్టరు సి.హరికిరణ్, నగర మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ ముఖ్య అతిధులుగాను, జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ఎ.భార్గవ్ తేజ, జి.రాజకుమారి విశిష్ట అతిధులుగాను హాజరై ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు అలంకరించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు, దేశ భక్తులు తమ నిస్వార్థ త్యాగాలతో స్వేఛ్చా, స్వాతంత్య్రాలను మనకు అందించారని, వారి జీవితాలు, ఆశయాలు తరతరాలకు స్పూర్తి నిస్తాయని, అందుకే వారి జయంతి, వర్థంతులను ప్రభుత్వ కార్యక్రమాలుగా కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోందన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వాతంత్ర్యం పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయక చూపిన తెగువ, ప్రజా సేవలో తన సర్వస్వం అర్పించిన త్యాగనిరతి సమున్నత ఆదర్శాలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆయన జీవిత విశేషాలను నేటి తరం తప్పక తెలుసుకోవాలని కొరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, జడ్పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ, సోషల్ వెల్పేర్ జెడి జె.రంగలక్ష్మీ దేవి, హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్, డ్వామా పిడి ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ ఆర్డిఓ ఎ.జి.చిన్నికృష్ణ, స్థానిక కార్పొరేటర్ ఎస్.లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.