ప్లీనరీ సాక్షిగా అమ్మ రాజీనామా..


Ens Balu
9
Hyderabad
2022-07-08 15:08:45

ఆంధ్రప్రదేశ్ లో అధికారలో ఉన్న వైఎస్సార్సీపీ కుటుంబ పరంగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే తెలంగానాలో పార్టీ పెట్టి షర్మిల దూరమవగా, ప్రస్తుతం తల్లి  విజయమ్మ కూడా దూరమవడంతో వైఎస్ ఆర్ సీపీ శ్రేణుల్లో ఆయోమయవాతావరణం ఏర్పడింది. ఇప్పటివరకూ పార్టీకి పెద్దగా.. గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్ విజయమ్మ ఏకంగా పార్టీకి రాజీనామా ప్రకటనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఖంగుతిన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ వారసులిద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం అది తారాస్థాయికి వచ్చింది. ప్రధానంగా ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారాస్త్రంగా చూపించి సానుభూతిని పొంది జగన్ అధికారం చేపట్టారు. ఇప్పుడు ఆమహానాయకుడు రాజశేఖరెడ్డి భార్య అయిన విజయమ్మ పార్టీ నుంచి తప్పించడం వెనుక పెద్ద కుట్ర జరిగినట్టు పార్టీ సీనియర్ నేతలు లోలోన మదన పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ ప్లీనరీ సాక్షిగా నాటకీయ పరిణామాలు  చోటు చేసుకున్నాయనే విషయం బాహటమైంది. అయితే ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ, తాను తన బిడ్డ వైఎస్ జగన్ కు ఏ విధంగా తోడున్నానో.. షర్మిలకు కూడా తోడుగా ఉండాలని ప్రకటించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఏదో కొత్త విషయం ప్రకటిస్తారని అందరూ భావిస్తే.. గౌరవాధ్యక్షురాలి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం..అమ్మా మీ రాజీనామాను మేము ఒప్పుకోలేకపోతున్నాము అనే దీర్ఘ గానం కార్యకర్తల్లో వినిపిచింది. ప్రస్తుతం రాజకీయాలను ద్రుష్టిమళ్లించడానికి వైఎస్సార్సీపీకి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించారా లేదంటే..నిజంగా తన కూతురు షర్మిలకు తెలంగాణలో సహాయ పడటానికి విజయమ్మే రాజీనామా చేశారా అనేది తేలాల్సి వుంది.