ఉత్తరాంధ్రలోని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు పూర్తయిపోయాయి, ఫలితాలు వచ్చేశాయి, టిడిపి ఎమ్మెల్సీ సంబురాల్లో కూడా పాల్గొంటు న్నారు. కధ ఇక్కడితో అయిపోయిందని అంతా ఊహించుకుంటున్నా.. అసలు ట్విస్టు మాత్రం ఇపుడే మొదలైంది. ఉమ్మడి 3 జిల్లాలు, కొత్త 6జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక భాగం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈశాఖలో 90% ఉద్యోగులు పట్టభద్రులు. వీరం తా అధికారపార్టీ అభ్యర్ధికి ఓటు వేసినా అత్యధిక మెజార్టీ వస్తుంది. అంతేకాకుండా వారి కుటుంబాలతోనూ, స్నేహితులతోనూ ఓట్లు వేయించి నా ఖచ్చితంగా అధికారపార్టీ అభ్యర్ధి గెలిచితీరాలి..కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వపార్టీ అభ్యర్ధి పరాజయం చెందాడు దీనితో ఇపుడు ఉద్యోగులు టిడిపి అభ్యర్ధికి ఓటువేశారా, లేదంటే వైఎస్సార్సీపీ అభ్యర్ధికి ఓటువేశారా అనే కోణంలో కూపీ లాగే ప్రయత్నాలు చేస్తున్నాయి నిఘా వర్గాలు. నిజంగా వీరంతా టిడిపికే ఓటు వేస్తే 2024లో ఇదే సీన్ రిపీట్ అవుతుందంటున్నారు విశ్లేషకులు..?!