మీరు కట్టడమూ అయ్యింది..కూలడమూ జరిగింది..గంటా


Ens Balu
36
Visakhapatnam
2023-08-27 12:16:34

విశాఖ నగరంలో దాదాపు రూ.40 లక్షలు వ్యయంతో మీరు నిర్మించిన మోడల్‌ బస్‌షెల్టర్ నాలుగు రోజులకే కుప్పకూలింది. ఒక చిన్న బస్ షెల్టర్ నే సక్రమంగా కట్టలేని వాళ్ళు, రాజధాని, పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రచారాలకు తప్ప అభివృద్ధికి, నిర్మాణాలకు పనికిరాని ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయ్యిందంటూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కూలిన బష్ షెల్టర్, కట్టిన తరువాత దాని ముందు దిగిన ఫోటోను జతచేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. తుమ్మితే వూడే ముక్కు చందంగా మారిన బస్‌షెల్టర్లు కోసం ఆరోజు గ్రీన్‌బెల్ట్‌లోని దశాబ్దాల వయస్సు కలిగిన భారీ వృక్షాలను విచక్షణారహితంగా నరికేసుకుంటూ పోయారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు, మీ ప్రచారాల ప్రభుత్వం కూడా కూలిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ #ByeJagan అంటూ ట్యాగ్ చేశారు.