తాడికొండ ఎమ్మెల్యే డా.ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ ప్రెస్ మీట్ లో పేల్చిన బాంబు విశాఖలో విస్పోటనం రేపుతోంది. వైఎస్సార్సీపీ పార్టీలో విశాఖ నుంచి ఒక ఎమ్మెల్యే అసంత్రుప్తితో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఉమ్మడివిశాఖజిల్లాలో దావాలనంలా వ్యాపించాయి. నిజంగానే విశాఖలో అసంత్రుప్తి అధికారపార్టీ ఎమ్మెల్యేల ఉన్నారా..? అనేవి ధంగా ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ఇపుడు విశాఖలో దుమారం రేపుతున్నాయి. అధిష్టానం నలుగు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన మూడు రోజులకే తిరుగుబా టు జెండా ఎగురవేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల తీరు ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలా గురువులు ఓడిపోయి నపుడు విశాఖ నుంచే ఒక ఎమ్మెల్యే తేడా ఓటు వేశారనే ప్రచారం జరిగింది. ఆ గాలి కాస్తా ఆ నలుగురు ఎమ్మెల్యేలపైకి వెళ్లినా..నేడు మళ్లీ నలుగురిలో ఒకరైన ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు విశాఖలో అధికారపార్టీ నేతల్లో అనుమానపు బీజాన్ని నాటినట్టు అయ్యింది. దానిపై ఎవరూ స్పందించలేదు..?!