ఆంధ్రా వాళ్ళను కుక్కలు తరిమి తరిమి కొట్టమన్నావు.. అక్కడి పాలకులకు పార్టీలు అవసరమా అన్నావు.. ఆంధ్రాకు నీరు ఆపావు.. కృష్ణ ట్రిబ్యునల్ అడ్డుకున్నావు.. ఇపుడు ఏం మొహం పెట్టుకుని ఆంధ్రాలో అడుగు పెడతావంటూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పై రాజ్యసభ సభ్యులు జెవిఎల్ నరసింహారావు ఘాటు విమర్శలు చేశారు. మంగళవారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో దుర్మార్గపు పాలనచేసి నేడు బీఆర్ఎస్ అంటూ ఆంధ్రాలోకి అడుగుపెడితే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ముందు ఏపీ ప్రజలకు బహిరంగంగా క్షమాపన చెప్పి, మోడీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.