175 వస్తే మరో30 ఏళ్లు అధికారంలో మనమే ఉంటాం


Ens Balu
20
Vijayawada
2023-01-04 16:08:29

ఈసారి 175 సీట్లు గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం అని సీఎం జగన్ అన్నారు. బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకో వాలన్నారు. ఎలాంటి విభేధాలున్నా పక్కన పెట్టాలని, ఏమైనా సమస్యలుంటే మనలో మనం సర్దుబాటు చేసు కుందాం అని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినా ష్ పోటీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించారు. పార్టీ గెలుపునకి సైనికుల్లా పనిచేయాలన్నారు.