YSRCP మహిళావిభాగం అధ్యక్షులుగా వరదుకళ్యాణి


Ens Balu
23
Visakhapatnam
2023-01-05 15:04:48

వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసి డెంట్ గా ఎమ్మెల్సీని వరుదుకళ్యాణిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. పార్టీలో అన్ని విభాగాల్లోనూ పోస్టులను భర్తీచేస్తున్న తరుణంలో ఈమెను మహిళా విభాగానికి కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించారు. ఈమె నియామకం పట్ల పలువురు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జనవరి నెలాఖరు నాటికి పార్టీలోని అన్నివిభాగాల్లోని పోస్టులను కేంద్ర కార్యాలయం యుద్ధ ప్రాతిపదిక భర్తీచేస్తూ వస్తున్నది. మరికొంత మందికి కూడా పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.