నిరుపేద ప్రజలను చంపిన వ్యక్తికి పరామర్శా


Ens Balu
18
Tadepalli
2023-01-10 14:11:39

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పేద ప్రజల్ని పొట్టన బెట్టుకున్న వ్యక్తిని పరామర్శ పేరుతో పవన్ కళ్యాణ్ కలవడంపై వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ శివ శంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దర నాయకుల కలయికపై టీడీపీ జనసేన మిత్రబంధం పూర్తిగా అర్థమవుతుందదని విమర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలను పరమర్శించ కుండా చంపిన వారి ఇంటికి పోవడం ఏంటని అయోమయం వ్యక్తం చేశారు. పర్మిషన్ లేదని కుప్పంలో పోలీసులు అడ్డు పడితే నడిరోడ్డుపై చంద్రబాబు హడావిడి సృష్టించారని అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకడాన్ని ఆయన ఖండించారు.

  

ప్రజల ముందుకు రాగానే సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కు కుప్పంలో  పోలీసులపై చంద్రబాబు చేసిన కామెంట్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు పోలీసులను నానా మాటలు అంటుంటే ఓ కానిస్టేబుల్ కొడుకుగా మౌనంగా ఉన్న నువ్వు నేడు పోలీసులను నిందించడం ఏంటని విమర్శించారు. దీని బట్టి నీ ద్వంద వైఖరి అర్థమవుతుందని దుయ్యబట్టారు. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేడని.. మీ అన్నకు ఉన్న స్టార్ డమ్ వల్లే నువ్వు జనాలకు తెలుసని పేర్కొన్నారు.