భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76ఏళ్లు గడుస్తున్నా మన్యంలోని గిరిజనుల బతుకులు మాత్రం మారలేదు. ఆ ప్రాంతాలు అసలే అభివృద్ధి చెందలేదు.. పాలకు లు పట్టించుకోలేదు..ఐటిడిఏలు ముందుకి రాలేదు. అనాదిగా గిరిజనుల వేదన అరణ్య రోధనే అవుతున్నది. జనసేన పార్టీ ఆవిర్భవించిన తరువాత ఏజెన్సీలో ని గిరిపు త్రుల సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..ప్రభుత్వం దృష్టికి వెళుతున్నాయి..దానికి అంతటికీ కారణం ఒకే ఒక్కటే వంపూరు గంగులయ్య అరకు పార్లమెం టు నియోజవర్గం ఇన్చార్జిగా గిరిజనుల సమస్యలపైనే అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ఏకైన ప్రజానాయకుడు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల కష్టాలను చూస్తూ తనవంతుగా సహాయం అందిస్తూ..ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని కదిలిస్తున్న నాయకుడు. ఇపుడు అతనే గిరిపుత్రుల
నాడి, వాడి, వేడి అయ్యాడు. అరకు పార్లమెంటు రథసారధిగా గిరిపుత్రుల మద్దతుతో ముందుకి సాగుతున్నాడు.