ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా ఏవిధంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సీఎం వైఎస్.జగన్ ప్రకటించడం కోర్టులంటే గౌరవం లేకపోవడమేనని అమలాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా చిన్న దేశాలు, డ్రగ్స్ సప్లై చేసే దేశాల నుంచి పెట్టుబుడులు వస్తాయని..వీటినే జగన్ అగ్రరాజ్యాలుగా ఫీలవుతున్నారంటూ ఎద్దేవాచేశారు. పెట్టుబుడల సమ్మిట్ లోనే తాను విశాఖపట్నం మకాం మార్చేస్తున్నట్టుగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కోర్టులంటే గౌరవం ఉన్నావారు కోర్టు తీర్పుల వరకూ వేచి ఉంటేనే కోర్టులపై గౌరవం ఉన్నట్టన్నారు.