ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేకజిల్లాగా గుర్తింపు పొందిన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కందుల నాగరాజు జనసేనమార్కు చూపించడంలో దూకుడు పెంచారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేన పార్టీలోకి మారిన నాటి నుంచే కార్యకర్తలు, అభిమానులు, సామాజిక వర్గ సమీకణల్లో పై చేయి సాధిస్తున్నారు. ఎన్నడూలేనివిధంగా రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపించే కార్యక్రమాలకు జనసేన నాయకుడిగా కందుల తనవ్యూహాలకు పదునుపెడుతున్నారు. యువతను ఆకర్షించడానికి తన ఇద్దరు కుమారులతో కదన రంగంలోకి దిగి పార్టీబలాన్ని పెంచేదిశగా అడుగులు వేస్తున్నారు. ఆత్మీయ కలయికలతో విశాఖ దక్షిణంలో అపుడే హాట్ టాపిక్ అయ్యారు.