కోలా గురువులు అనే నేను మీ ఎమ్మెల్సీగా...
Ens Balu
37
Tadepalli
2023-02-20 09:33:01
విశాఖలో మత్సకార సామాజిక వర్గానికి సీఎం.వైఎస్ జగన్మోహనరెడ్డి అత్యంత పెద్ద పీట వేశారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు, మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోలా గురువులను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేస్తున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో కోలాగురువులు ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ ఉన్న ఈయన సేవలను పార్టీ గుర్తించి నేడు రాష్ట్రంలో పెద్దల సభ చెప్పుకునే శాసన మండలికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంపిస్తున్నది. దీనితో మత్స్యకార కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఈయనకు విశాఖలోపాటు ఉత్తరాంధ్రా మత్స్యకారుల్లో మంచి గుర్తింపు వుంది. పట్టువదలి విక్రమార్కుడనే మరో పేరు కూడా ఉంది. నేడు చట్టసభలకు వెళ్లాలనే గురువుల కోరిక వైఎస్సార్సీపీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిజం చేసి చూపించారు..