పట్టభద్రులు తెలివి మీరారా నమ్మించి దెబ్బకొడతారా..?


Ens Balu
71
Visakhapatnam
2023-03-02 06:45:00

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు తెలివి మీరినట్టే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నది. పట్టభ ద్రులు, ఉపాధ్యాయుల  ఓట్లు సదరు ఇంట్లో ఉన్నా లేకపోయినా అన్ని పార్టీల వాళ్లు వెళ్లి ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. దీనితో ఈసారి మాఓటు మీకే అంటున్నారు ఓటర్లు. ప్రస్తుత రాజకీయాలు నేపథ్యంలో నేతలను నమ్మించి దెబ్బకొట్టాలని చూస్తున్నట్టుగానే ఓటర్ల నాడి అవగతం అవు తున్నదని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. కొన్ని చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా స్వతంత్ర అభ్యర్ధులు పోటీ పడుతు న్నారు. ప్రధాన పార్టీల నేతలతోపాటు ఈసారి స్వతంత్ర్య అభ్యర్ధులే అధికంగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. దీనితో ఓట్లు బాగా చీలిపోతా యనే ఆందోళన కూడా వెంటాడుతోంది. మరోప్రక్క ఓటుకి ఎంతైనా ఇచ్చి కొనాలనే ఆలోచనలో గ్రూపు సమావేశాలు కూడా పెట్టి ఓటర్ల నోట్లతో కొనాలనే ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది.