కౌన్ బనేగా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ..!


Ens Balu
91
Visakhapatnam
2023-03-10 10:31:07

కౌన్ బనేగా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ..? ఇంతకీ ఎవరు పీఠం కైవసం చేసుకుంటారు..? ఎవరు పట్టభద్రుల మనస్సు గెలుస్తారు..? ఈసారి ఎమ్మెల్సీ ఓట్లు ఎవరి వలన చీలిపోతాయ్..? నోటాకి పడేఓట్లెన్ని..? ఇపుడు సర్వత్రా ఇదే మాట.. ఇదే టాపిక్..! గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల ను తలపిస్తున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రాలోనే 37 మంది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుచున్నారంటే పరిస్థితి ఏవిధంగాఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ అభ్యర్ధికి ప్రభుత్వ ఉద్యోగులు(సచివాలయ ఉద్యోగులు మినహా), ఉపాధ్యాయులు ఓట్లు పడవని, ఆఓట్లన్నీ పీడిఎఫ్ అభ్యర్ధికి 40%, టిడిపి అభ్యర్ధికి 40% మిగిలిన 20% స్వతంత్ర అభ్యర్ధులకు వెళ్లిపోతాయని చెబుతున్నారు. ఇక బీజేపి అభ్యర్ధికి సదరుపార్టీ ఓట్లు మాత్రమే పడతాయని అంటున్నారు. అధికారపార్టీ అభ్యర్ధి గెలవకూడదు అనుకుంటే ఆ ఓట్లు పీడిఎఫ్ అభ్యర్ధి, బీజేపి అభ్యర్ధికి పడిపోతాయనే ప్రచారాన్ని పార్టీల ఫాలోవర్లు తీసుకెళుతుండటం గమనార్హం..!