విశాఖలో ఒకే ఒక్కడు..!


Ens Balu
2
Visakhapatnam
2021-02-27 08:37:58

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుడంటే ఒక హోదా..ఒక ఠీవీ..ఒక దర్పం..వెనుక మందీ మార్భలం..అబ్బో చెప్పలేని హడావిడీ.. ఏ కార్యక్రమమైనా ఎంతో అట్టహాసంగా చేసి..నాలుగు కార్పోరేట్ కంపెనీలు ప్రారంభోత్సవం చేసి..మీడియాలో పబ్లిసిటీ..ఇది రాజ్యసభ సభ్యుని పదవి అనే నాణేనికి ఒక వైపు. రెండో వైపు ఏ పార్టీ నుంచైతే రాజ్యసభ్యకు వెళ్లారో ఆ పార్టీ హైకమాండ్ భజన.. సబ్బుకంటే నురగ కంటే అత్యంత దారుణంగా నురగ తీసే వ్యవహారం.. మరోసారి రాజ్యసభ సీటు కోసం పోరాటం, సీటు దక్కించుకోవడానికి ఆరాటం అన్నీనూ..ఏంటి విషయం చెప్పకుండా ఈయనేదో సినిమా చూపించడానికి ఈ ఉపోద్గాతమంతా చెబుతున్నాడు అనుకుంటున్నారా..అలా అనుకుంటే రాజకీయనాకుడు ఇచ్చిన హామీల మాటల్లో కాలుపెట్టినట్టేనని భావించుకోండి..మీరు చదువుతున్నది నిజమే..నేను చెప్పబోయేదీ నిజమే..అవునండి రాజ్యసభ సభ్యులంటే ఇప్పటి వరకూ అలానే నడిచింది రాజకీయమంతా..కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాత్రం రాజ్యసభ ఎంపీ అంటే ఒక బాధ్యత, ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ఆధారణ, ఒక పోరాటం ఇవన్నీ మీకు విశాఖ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డిలో కనిపిస్తాయి చూడవచ్చు కూడా. ఇదేదో డబ్బాకొట్టడానికి రాస్తున్న కధనం కాదు. చాలాకాలం తరువాత రాజ్య సభ సభ్యుడంటే ఒక ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేయడానికి ఇంతలా కష్టపడతారా అన్నట్టుగా పనిచేసే విధానం రాబోయే రోజుల్లో చాలామందికి ఆదర్శం కాబోతుంది. విశాఖ చరిత్రలో ఏ రాజ్యసభ సభ్యుడూ ఉత్తరాంధ్రా కోసం, విశాఖ నగర అభివ్రుద్ధికోసం కష్టపడనంతగా ఈయనొక్కడే...ఒకే ఒక్కడుగా కష్టపడుతున్న తీరు ఇపుడు ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంది.. ఆలోచింపచేస్తుంది. 50ఏళ్లు దాటినా కూడా అలుపెరగని ఉత్సాహంతో ఆయన చేసే పాదయాత్రలు, ఉద్యమాలు, ఉపన్యాసాలు, పరిపాలనా, రాజకీయం చూస్తుంటే విశాఖ అభివ్రుద్ధిని దేశంలోనే సిఖరాగ్రంగా నిలపాలనే భావన కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. రాజ్యసభ సభ్యుడంటే ఒక పార్టీ ఎమ్మెల్యేనో, మంత్రో, లేదంటే ఎమ్మెల్సీనో, అదీకాదంటే పార్టీలోని పెద్దలే వెళ్లి మాట్లాడితే తప్పా మాట్లాడని ఈరోజుల్లో...ఒక సామాన్యమైన వ్యక్తి వెళ్లినా నేరుగా ఆయనతో మాట్లాడి సమస్యలు తెలుసుకునే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయసాయిరెడ్డి. అంతేకాదు ఎవరు ఏమనుకున్నా తన పదవికి, హోదాకి, పార్టీకి గౌరవం తెవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని అలుపెరగకుండా చేస్తున్న విశాఖ అభివ్రుద్ధిలో కీలకమయ్యారు విజయసాయిరెడ్డి. ఈ నేపథ్యంలో చాలా మంది ఆయన ఎవరికీ సహాయపడరు, ఎవరి మాటా వినరు, ఆయన కోటరీ వేరే, ఆయనకి దగ్గర కావాలంటే అవతలి వ్యక్తిలో చాలా విషయముండాలి అనే మాటలకు విజయసాయిరెడ్డి పెద్ద స్పందించరు...పైగా వాటన్నింటికీ ఒకటే సమాధానం నిండైన చిరునవ్వు. నువ్వు పార్టీకోసం ప్రభుత్వం కోసం చేయాల్సిందంతా చేస్తే పార్టీయే నిన్ను వెతుక్కుంటూ వస్తుందనే మాట చెబుతూనే.. దానినే పాటిస్తూ ప్రస్తుత రాజకీయనాయకులందరికీ మార్గదర్శిగా, పార్టీలోని చాలామంది నేతలకు గాడ్ ఫాదర్ గా మారారు విజయసాయిరెడ్డి. సైరా నరసింహారెడ్డి సినిమా ఎంత పాపులర్ అయ్యిందో తెలీదు కానీ..ప్రతిపక్షంపైనా, ప్రజా వ్యతిరేక విధానాలపైనా విజయసాయిరెడ్డి(సైరా) పేరుతో సోషల్ మీడియాలో పడే పంచ్ లకు అంతులేని పాపులారిటీ పెరిగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే సైరా పంచ్ లకు పడని వారుండరంటే అతిశయోక్తికాదేమో. అదే స్థాయిలో ప్రతిపక్షనేతలు చేసే తప్పులను, ప్రజా వ్యతిరేవిధానాలను ఎండగట్టే తీరుకూడా అగ్రబాగాన్నే వుంటుంది. ఇంత చేసినా పొగడ్తలకు పొంగిపోకుండా, తిట్ల పురాణాకి కుంగిపోకుండా..వైఎస్సార్సీపీలో జాతీయ కార్యదర్శిగా పార్టీ అభివ్రుద్ధికి నేతలను ప్రజా నాయకులుగా మార్చడానికి ఆయన చేస్తున్న సేవ...అన్నీ వెరసీ ఒకేఒక్కడిగా నిలబెతున్నాయంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఒక పార్టీ జనాల్లో ఇంతబాగా వెళ్లిదంటే దానికి విజయసాయిరెడ్డి లాంటి వారి తెలివి, పాలనా దక్షత, ప్రజల కోసం ఏదో చేయాలనే తపన అనే మాట ఇపుడు ప్రతీఒక్కరి నోట నుంచి వస్తుందంటే ఏ రాజకీయనేతకు రాని గుర్తింపు, మంచి పేరు ఈయనకు రావడమే. ఈ వార్త అంతా చదివిన తరువాత విశాఖ రాజ్యసభ్య సభ్యులు విజయసాయిరెడ్డిలోని అన్ని కోణాలను బాగానే టచ్ చేశాడంటూనే..ఒక ప్రత్యేక కోణంలోనూ చూపించే ప్రయత్నం చేశాడని అనుకోవచ్చు. అంతేకాదు మనసులో పార్టీ పట్ల అభిమానమైనా సైరా కోసం ఇంతలా రాసేలా చేసిందనే అనుకోవచ్చు...ఎవరు ఏమనుకున్నా..ఎవరి నోట నుంచి ఏ మాట విధంగా వచ్చానా.. మాటని తూటాలా పేల్చడానికి విమర్శలు చేయాలని చూసినా ఇందులో పెద్దగా ఫీలవ్వాల్సిన పనేమీ ఉండకపోచ్చు..చాలా సంవత్సరాల తరువాత ఒక మంచి లక్ష్యం ఉన్న నాయకుడిని, మంచి పరిపాలనా దక్షత ఉన్న నేతను, ప్రజల మనిషిని, పార్టీ విధేయుడిని, అందరివాడిగా పేరుపొందిన వ్యక్తిని చూసిన తరువాత అలవోకగా వచ్చిన పదాల అల్లికే ఈ ఒకేఒక్కడు కధనమని మనసున్న వారంతా గుర్తించాలి..తప్పదు..!