యాదవుడి శాపం ఖచ్చితంగా తగులుతుంది..


Ens Balu
3
Visakhapatnam
2021-03-18 21:39:57

పదేళ్ల నాకష్టం, శ్రమ, పార్టీకోసం చేసిన సేవ, విలువైన సమయం వ్రుధాగా పోయింది..ఎమ్మెల్యేగా రానీవ్వలేదు..జీవిఎంసీ మేయర్ ని కానివ్వలేదు..పార్టీఅభివ్రుద్ధి కోసం పడిన కష్టం, నిశ్వార్ధంగా ప్రజలకు చేసిన సేవ అన్నీ వ్రుధా..కావాలనే రాజకీయం చేసి నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారు.. వైజాగ్ వైఎస్సార్సీపీలో ఇంట్రనల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు..యాదవుడి శాపం ఖచ్చితంగా తుగులుతుంది. ఒకసారి అడ్డుకున్నారు..అది వారికి తగిలింది..మళ్లీ అడ్డుకుంటున్నారు మరోసారి మా ఉసురు తగులుతుంది..అంటూ విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ పదవి ఇస్తానంటేనే తాను కార్పోరేటర్ గా బరిలో నిలబడ్డానని అన్నారు. కానీ చివరకి రాజకీయం చేశారని విచారం వ్యక్తం చేశారు. జీవిఎంసీ వద్ద మీడియాతో మాట్లాడారు వంశీ. ఇంతటి పరాభవం జరిగిన తరువాత ఏ తాను విశాణ నగర అధ్యక్ష పదవిలో కొనసాగడం బావ్యం కాదని తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కాగా తన విషయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చాలా పాజిటివ్ గా ఉన్నారని, కానీ జిల్లాలో మాత్రం రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి రాజకీయాలు పార్టీ ఎదుగుదలకు మంచిది కాదని, ఈ రోజు నన్ను మోసం చేశారు..ఇలాగే రేపు మరొక నేతను మోసం చేస్తారని, ఇలాంటి కుళ్లు రాజకీయాలు, దుష్టరాజకీయాలు విశాఖలాంటి నగరంలో మంచిది కాదన్నారు. తాను రెండు మూడు రోజుల్లో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ఆయన ఏవిధంగా చెబితే అలా చేస్తానని అన్నారు. ఇలాంటి తేడా రాజకీయాలు చేసినంత మాత్రనా తాను క్రుంగిపోనని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల మధ్యనే ఉంటానని వంశీ మీడియాకి వివరించారు. ప్యాకేజీలు తీసుకొనే పదవని వదులుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...ప్యాకేజీలు కోరుకునేవాడ్నైతే ప్రజలకు సేవచేయడానికి పదేళ్లు ఎందుకు వ్రుధా చేసుకుంటానని బదులిచ్చారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనే ఒకే ఒక్క కారణంతోనే నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.