ఎల్లో మీడియాతో ఇక ప్రత్యక్ష యుద్దమే..


Ens Balu
7
Tadepalli
2022-07-30 04:35:04

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో యుద్దాలు జరబోతున్నాయి.. ఇప్పటి వరకూ మాటల తూటాలు మాత్రమే పేలిన రాష్ట్రంలో ఇక ప్రత్యక్ష యుద్దానికి ప్రభుత్వం నుంచి కార్యకర్తల వరకూ ప్రతీ ఒక్కరూ సిద్ధమవుతున్నారు. ఏంటి యుద్దమంటే తన్నుకునే కొట్టునే చంపుకునే యుద్దం కాదు..ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మకుండా ఉండేందుకు జరిపే పోరుబాట. ఈ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అన్న సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పిలుపుతో పార్టీ అధికారిక సోషల్ మీడియా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎదురుదాడి చేయడానికి సిద్దమయ్యారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఎల్లో మీడియాలో అసత్యప్రచారం జరిగినా దానిని తిప్పికొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. దానికోసం రాష్ట్రస్థాయిలో ఒక బ్రుందం, జిల్లా స్థాయిలో మరో బ్రుందం, మండల, గ్రామస్థాయిలో నేతలు, కార్యకర్తలు ఇలా అందరూ ప్రత్యేక బెటాలియన్ లా మారి వ్యతిరేక ప్రచారానికి గాలి తీసేసే ప్రయత్నం మొదలు పెట్టారు. అధికారిక కార్యక్రమాలకు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక మీడియాకి కనీసం కబుర్లు కూడా చెప్పని ప్రభుత్వం, మంత్రులు, నాయకులూ గ్రామాలు, మండలాల్లో కూడా వారిని అంటరానివారిగా చూసే చర్యలకు దిగుతున్నారు. ఒక రకంగా ఎల్లో మీడియాలో ఆత్మ స్తైర్యాన్ని పూర్తిగా అనగదొక్కేందుకు ఎక్కడికక్కడ కార్యాచరణలు మొదలయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు నవరత్నాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. మంచిని చూడకుండా అందులో ఒకరిద్దరికి సాంకేతిక కారణాలు.. అర్హతలు లేకపోవడం వలన పథకాలు అమలు కాకపోతే వాటినే ఎల్లోమీడియా బూతద్దంలో పెట్టి మరీ చూపుతోంది. అంతేకాదు వివిధ ఛానళ్లలో ప్రత్యేక డిబేట్లు పెట్టి పదే పదే గోరంత విషయాన్ని కొండంతలు చేసి చూపి దానినే నిజం అని ప్రజలు నమ్మేలా చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక సిటీ కేబుల్ లైన్ ఏపీ ఫైబర్ నెట్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లతో పాటు మరికొన్ని తోక ఛానళ్ల  ప్రసారాలు నిలిచిపోయాయి. ఇటు ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలను పార్టీలో నాయకులు ఎవరూ వినియోగించే పరిస్థితి గానీ కొని చదివే పరిస్థితి గానీ లేకుండా పోయాయి. ఇక ఏపీ ఫైబర్ నెట్ లో ఎల్లో మీడియా ఛానళ్లను చూడాలంటే దానికి ప్రత్యేకంగా రుసుము చెల్లిస్తే తప్పా ఆ ఛానళ్లు ప్రసారం అయ్యే పరిస్థితి లేదు. దానితో వారంతా ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానళ్లు, కంటెంట్ స్టోరీలను అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ప్రజల ముందుకి తీసుకెళుతున్నారు. ఎప్పుడు ఎక్కడ.. ఏవిధంగా తప్పుడు, అసత్య ప్రచారం చేసినా దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నేరుగా దిశా నిర్ధేశం చేయడంతో నేతల నుంచి కార్యకర్తల వరకూ అందరూ అదే పనిలో నిమగ్నమైపోయారు.

ప్రభుత్వంపై పదే పదే బురద జల్లుతుంటే ఏ ఒక్కరూ చూసి ఓర్చుకునే పరిస్థితి ఉండకూడదు. నిజంగా తప్పు జరిగితే సరిద్దుకోండి. లేని పక్షంలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరూ వాటిని ఖండించకపోతే ప్రజలు అదే నిజమని నమ్మే ప్రమాదముందని..ఆ విషయంలో ప్రతీ ఒక్కరూ తప్పుడు ప్రచారాలను ఖండించాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహరెడ్డి పిలుపునివ్వడంలో ఎదురు దాడికి సిద్దమైంది వైఎస్సార్సీపీ కేడర్ అంతా. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతున్నన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా అమలు కావడం లేదు. అన్నీ డబ్బుతో కూడుకున్నవే..అందునా వందల కోట్ల రూపాయాలు వెచ్చించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో జరిగే కొన్ని కొన్ని తప్పులను కావాలని చేస్తున్న అతిపెద్దతప్పులుగా..అక్రమార్కులుగా చిత్రీకరించడంలో ఎల్లోమీడియా చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వంపైనా..పార్టీలపైనా..అధికార యంత్రాంగంపైనా జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని.. అదే సమయంలో వాస్తవాలను కూడా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని కూడా అన్ని జిల్లాలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు కూడా క్రుత నిశ్చయంతో ఉన్నాయి.

ఇక పార్టీలో ఉంటూ.. అంతర్గతంగా జరిగే కొన్ని వ్యవహరాలను ఎల్లోమీడియాకి ఉప్పందించే నేతలను, కార్యకర్తలను కూడా వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. వారి వలన ఎల్లో మీడియాకు పార్టీలో జరిగే చాలా కార్యక్రమాలు ముందుగానే తెలిసిపోవడం వలన గోరంతలు కొండంతలై ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న ప్రభుత్వం, అధికార పార్టీ ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. చాలా వరకూ నేతలు ఫోన్లతో కంటే నేరుగానే ఎక్కువగా సంభాషణలు చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఇబ్బందులు రాకుండా అందరూ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూనే.. ప్రభుత్వంపై జరిగే అన్ని అసత్యప్రచారాలను తిప్పికొట్టే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో ప్రజా వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక అంశాలను కూడా పార్టీ కేంద్ర కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నది. అన్ని వర్గాల ప్రజలను మెప్పించి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో అడ్డువచ్చేవారిని వారి తప్పులను ఎత్తిచూపి మరీ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీ నుంచి గ్రామస్థాయి కమిటీల వరకూ ఎల్లో మీడియా అసత్య ప్రచారంలో ఇక తగ్గేదే అంటున్నారు..!