ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలపై స్పందించింది.. స్వర్ణవార్డు, స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు(గ్రామ, వార్డు సచివాలయశాఖ) రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పనుంది.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు ఇచ్చి ఉగాది నాటికి ప్రక్రియ పూర్తిచేయాలని యోచిస్తున్నది.. దానికోసం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు.. సచివాలయశాఖలోని ఉద్యోగుల వివరాలు, సీనియారిటీ, మెరిట్ లిస్టులను కూడా సిద్దం చేయాలని అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సచివాలయ ఉద్యోగులందరూ ఇతర 74 ప్రభుత్వశాఖల్లోని మాతృశాఖలకు చెందిన ఉద్యోగులు కావడంతో ఇపుడు వీరికి కూడా లైన్ క్లియర్ అవనుంది. అయితే కోర్టు కేసులు కారణంగా మహిళా పోలీసుల విషయంలోనే అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చినా దానిపై అతీగతీ లేదు.. దీనితో తమ పరిస్థితి ఏమౌతుందోనని మహిళా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖలుంటే 74 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, అధికారులు ఒకేసారి వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే రిటైర్ కావాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం వీరి ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచేయడంతో అది కాస్తా ఆలస్యమై ఇపుడు ఏక బిగిన అన్ని ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు ఒకేసారి రిటైర్ అయిపోతున్నారు. ఈ క్రమంలో అన్నిప్రభుత్వశాఖల్లోని ఖాళీలు భర్తీచేయాలంటే రాష్ట్రప్రభుత్వం ఆ సాహసం చేయలేదు. దానితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లోని డిప్యూటేషన్లు పంపడంతో పాటు.. ఉన్నావారిలో కొందరికి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ అంశాలనికి సంబంధించి పది మంది మంత్రులతో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే నియామకాలు చేసిన మాతృశాఖలోని ఉద్యోగులకు ఏ విధంగా పదోన్నతులు ఇవ్వాలనే అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అధ్యయం చేసింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రభుత్వశాఖల్లోని అధికారులు, సిబ్బంది కూడా వేల సంఖ్యలో రిటైర్ కావడంతో.. ఆ ఖాళీలను భర్తాచేయడానికి రాష్ట్రప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలను కుదించేసింది... అనగా ఇక్కడి సిబ్బందిని కేటగిరీలుగా విభజించి ఉద్యోగుల సంఖ్య తగ్గించేసింది. అలా తగ్గించేయగా వచ్చిన సిబ్బందిని పోస్టులు మిగిలిపోయిన సిబ్బందిని ఇతర ప్రభుత్వశాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు ఆరునెలల క్రితమే జీఓలు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కుస్తీ పడితే ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వశాఖల్లోకి సర్ధబాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక మిగిలిన సిబ్బంది వివరాలను సీనియారిటీ లిస్టు తయారు చేసి వారికి పదోన్నతులు ఇవ్వనుంది. భారతదేశంలోనే సర్వీసు రూల్స్ లేకుండా, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా ఆరున్నరేళ్లు సిబ్బందితో ఉద్యోగాలతోపాటు అదనపు పనులు చేయించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా అదనపు పని ఒత్తిడి ఉద్యోగులపై పెట్టి అత్యధిక సంఖ్యలో ఉద్యోగుల గుండెపోటు, బలవన్మరణాలకు కారణం కూడా అయ్యింది. ఉద్యోగుల మరణాల పరంపర రోజుకి ఒకరు లేదా వారికి ముగ్గురు చొప్పుగ గత ఆరునెలలుగా మరణ మృదంగం కొనసాగుతూనే వుంది. ఉద్యోగులు ఆందోళన సిద్దపడి.. కోర్టులో కేసులు వేయడానికి సిద్దపడిన తరుణంతో రాష్ట్రప్రభుత్వం మేల్కొని ఇపుడు ఇపుడు ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడానికి సిద్దపడింది. పదోన్నతులు ఇవ్వడానికి అయితే ముందుకి వచ్చింది కానీ.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సంగతీ తేల్చలేదు. పదోన్నతులు ఇచ్చే క్రమంలే ఏ సర్వీసే నిబంధనల ఆధారంగా పదోన్నతులు ఇస్తుందో కూడా క్లారిటీలేదు. కాకపోతే అన్నిప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పదోన్నతులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఎంతమందికి పదోన్నతులు వస్తాయి..? కోర్టు కేసులున్న మహిళా పోలీసులకు పదోన్నతులు ఇస్తుందో, లేదంటే ఇచ్చిన రెండు ఆప్షన్లలలోకి సర్దు బాటు చేస్తుందా అనేది తేలాల్సి ఉంది..?!