గ్రామ, వార్డు సచివాలయ శాఖ మహిళా పోలీసుల నియమాకాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమాలకు విరుద్దమనే కేసు హైకోర్టులో పెండింగ్ లోఉంది.. అసలు మహిళా పోలీసులకు రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అఫడవిట్ కోర్టు కూడా దాఖలైంది.. మీకు ఐసీడీఎస్ కావాలో.. పోలీసు శాఖ కావాలో ఎంచుకోవాలనే రెండు డిపార్ట్ ఆప్షన్లు ఇచ్చిన డేటా ఏమైందో తెలీదు.. 10 మంది మంత్రులతో కూడి క్యాబినెట్్ సబ్ కమిటీ ఏం నివేధిక ఇస్తుందో అసలే తెలీదు.. కానీ స్వర్ణవార్డు.. స్వర్ణ గ్రామ పంచాయతీలలో పనిచేసే మహిళా పోలీసులు మాత్రం నేటికీ గాల్లోనే ఉన్నారు.. సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇస్తామని ప్రభుత్వం ప్రపకటించిన వేళ.. వీటిని దాటుకొని ఏ విధంగా పదోన్నతులు కల్పిస్తారన్నదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్.. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం సచివాలయశాఖకు కనీసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ అసలు ఏర్పాటే చేయలేదు.. మరి పదోన్నతులు ఏ విధంగా ఇస్తుంది..?! ఎలా ఉద్యోగులకు మేలు చేస్తుంది..?
ఆంధ్రప్రదేశ్ లోని 75వ ప్రభుత్వశాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు (స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు) సచివాలయ శాఖలోని ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చేస్తుందని జరుగుతున్న ప్రచారం నుంచి అనేక అంశాలు ఇపుడు తెరపైకి వస్తున్నాయి. 2019 అక్టోబరు 1 నుంచి ప్రారంభమై ఈ సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం రెండూ దొందూ దొందూగానే వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి అవసరం అయితే రాత్రికి రాత్రే జీఓలు తెస్తోంది కానా.. ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు నిబంధనలు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలపై మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. ఓ ప్రక్క సచివాలయ ఉద్యోగులు అధికారులు పెట్టే పని ఒత్తిడి తట్టుకోలేక పిట్లల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్న వేళ ప్రభుత్వ సీఎస్ చేసిన ప్రకటన.. సచివాలయ ఉద్యోగుల్లోనూ.. అందులోనూ మహిళా పోలీసుల్లోనూ ఆనందాన్ని కలిగించినా.. వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
మహిళా పోలీసుల విషయంలో కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగానే కూటమి ప్రభుత్వం వీరికి రెండు ప్రభుత్వ శాఖల ఆప్షన్లు ఇచ్చింది. అయితే దానిపై క్లారిటీ లేకపోవడం చాలా మంది ఆ రెండు ప్రభుత్వశాఖల ఆప్షన్లు ఎంచుకోలేదు. ఇపుడు మళ్లీ పదోన్నతులు అంశం తెరపైకి రావడంతో కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగా ఏ విధంగా తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మహిళా పోలీసులు పెద్ద చర్చకు తెరలేపారు. అసలు ఉద్యోగులు విధినిర్వహణలో గుండాగి మృతిచెందుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఆర్ధికపరమై అంశాన్ని ఎక్కడ అమలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకోవడంతోపాటుగా.. శివరాత్రి శైవ క్షేత్రాల్లో పురుషుల మరుగు దొడ్ల వద్ద ప్రత్యే విధులు నిర్వహించాలని మహిళా పోలీసులపై ఉత్తర్వులు జారీ చేయడం, వీధుల్లోని కుక్కలు ఎన్నున్నాయో లెక్కించాలంటూ మహిళా శానిటేషన్ లకు ప్రత్యేక విధులు అప్పగించడం వంటి చర్యలతో తలలు పట్టుకుంటున్న వేళ.. పదోన్నతుల అంశం కూడా పెద్ద చర్చకు వస్తోంది.
ఇప్పటికే రెండు మూడు ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన రాష్ట్రప్రభుత్వం మిగిలిన ప్రభుత్వశాఖల సిబ్బంది పదోన్నతులు కల్పించలేదు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులే సచివాలయ వ్యవస్థ పరిపాల నపైనా రాజ్యాంగ భద్దం ఏర్పాటైన ఈ సచివాలయ శాఖ పరిపాలనపై సమాచారహక్కు చట్టం క్రింద 20 అంశాలకు సంబంధించి సమాచారం కావాలంటూ అర్జీ పెట్టాడు. వాస్తవానికి ఆ సమాచారం ఇస్తే రాష్ట్రప్రభుత్వం పక్కాగా దొరికిపోయినట్టే.. అందులో ఉద్యోగుల పదోన్నతులు, విధినిర్వహణలోని మరణాలు, నోషనల్ ఇంక్రిమెంట్లు.. సర్వీసు రూల్స్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు, ప్రత్యేక ఇంక్రిమెంటు, ఉద్యోగులకు కల్పించాల్సిన మౌళిక సదుపాయాలు తదితర అంశాలు ఉన్నాయి. దానికి సమాచారం ఇచ్చినా.. అటు కోర్టుకేసులో ఉండగా పదోన్నతి కల్పించినా.. అంది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుంది. అలాంటి సమయంలో అసలు ప్రభుత్వం మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పిస్తుందా.. లేదంటే కంటి తుడుపు చర్యగా ప్రకటన చేసిందా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాల తెలియడం లేదని.. ఆర్టికల్ 309, రూల్ 28కి అధిపతిగా ఉన్న గవర్నర్ కూడా స్పందించని సమయంలో తమ పరిస్థితి ఏంటని మహిళా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ పదోన్నతులు వచ్చినా తాము మాత్రం ఇలాగే ఉండిపోవాలా..? లేదంటే త్రిశంఖు స్వర్గంలో తేలిపోవాలా అంటూ వాపోతున్నారు. ఈనేపథ్యం క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఏం చెబుతుంది.. దాని ఆధారంగా ఏ ప్రభుత్వశాఖల్లోకి వీరికి పంపిస్తారు.. ఏ తరహా పదోన్నతులు ఇస్తారనే విషయం తేలాల్సి ఉంది..?!