తాడితన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడని ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్ శాఖకు చెందిన గ్రామీణ సహాయకులు నిరూపించారు.. ఒక్కొక్కరూ బినామీ రైతుల పేర్లతో రికార్డులు స్రుష్టించి పది లక్షలకు పైగానే అడ్డంగా నొక్కేసి జిల్లా అధికారులతో సహా పంచేసుకున్నారు. కొన్ని చోట్ల ఈ విషయం బయటకు పొక్కకపోయినా.. కొన్ని జిల్లాల్లో నొక్కేసిన మొత్తం లక్షలు, కోట్లు దాటేయడం, బినామీలుగా చూపించి రైతులు రోడ్డెక్కడంతో జరిగిన అవినీతిపై అధికారులు విచారణ చేపడితే డొంకంతా కదులుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అత్యధికంగా అత్యధికంగా రూ.15కోట్లు నెల్లూరు జిల్లాలో అధికారులు లెక్కలు తేల్చి 25 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులపై వేటు వేయగా..కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకూ రూ.11 లక్షలు లెక్కలు తేల్చి ఒక గ్రామీణ ఉద్యానవన సహాయకుడిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలు, విభజన జరిగిన తరువాత 26 జిల్లాల్లోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్టు అధికారులు గుర్తించినప్పటికీ కొన్ని చోట్ల అధికారులు, దెబ్బ నప్పించిన ఉద్యోగులు, మరికొందరు ప్రజాప్రతనిధిల అండదండలంతో విషయం బయటకు పొక్కలేదని చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రంగంలోకి దిగడంతో అసలు విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. రాష్ట్రవ్యాస్తంగా కోట్ల రూపాయాల్లో జరిగిన ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎంత మందికి ఎంతెంత ముట్టింది.. జిల్లాల వ్యాప్తంగా బినామీ పేర్లతో జరిగిన మోసం ఎంత అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారనే విషయం ఇపుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది.
9నెలలు అదనంగా పనిచేయించినందుకేనా..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయంలో తమతో అదనంగా 9నెలలు పనిచేయించి.. పేస్కేలులో నష్టం వచ్చేలా చేసి.. పెంచిన పీఆర్సీకి ఎరియర్స్ ఇవ్వకుండా అదనంగా పనిచేయించుకుందని అనుకున్నారో ఏమో..ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి బినామీ పేర్లు పెట్టి నొక్కేయాలని పథకం వేశారు. ఒకరో ఇద్దరో అనుకుంటే పర్వాలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది కూడబలుక్కొని చేసినట్టుగానే ఈ భారీ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయాల్లో ఈ స్కామ్ జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వశాఖ అయిన గ్రామ, వార్డు సచివాలయం పరువు పోకుండా ఉండేందుకు అవినీతికి పాల్పడిన వారి దగ్గర నుంచి రికవరీలు పెట్టినా..కొన్ని చోట్ల మాత్రం విషయం బయటకు వచ్చేసింది. దీనితో ఏం చేయాలో తెలియని అధికారులు సచివాలయ సిబ్బందిపై సస్పెండ్ వేటు వేశారు. అయితే ఈ అవినీతి తవ్వేకొద్దీ బయపడుతుండటంతో తమ మెడలకు ఎక్కడ చుట్టుకుంటుందేమోనని భయపడుతున్న జిల్లాశాఖల అధికారులు విచారణలు చేపట్టి దొరికిన వారిని దొరికినట్టుగా చేసిన అవినీతిని గుర్తించి సస్పెండ్లు చేస్తున్నారు. చేసిన అవినీతి మొత్తాన్ని రికవరీలు పెడుతున్నారు.
పూర్తిగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖలకు చెందిన సిబ్బందిపై ఆయా జిల్లా శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం ఇప్పటిది కాదు. ప్రభుత్వంలో శాఖ ఏర్పాటైన దగ్గర నుంచే ఉంది. జిల్లా అధికారులు తాము ఏం చేసినా పట్టించుకోవడం లేదనే విషయాన్ని గుర్తించిన వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా భారీ అవినీతికి తెరలేపారు. చేసిన అవినీతికి లక్షల రూపాయల ప్రభుత్వ, ప్రజా ధానాన్ని అప్పనంగా నొక్కేసినా విషయం బయటకు రాలేదు. కొన్ని చోట్ల జరిగిని మోసం రైతులు గుర్తించి అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడంతో ఏమీ చేయలేని స్థితిలో మాత్రమే అధికారులు విచారణ జరిపి బినామీ పేర్లతో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై సస్పెండ్ వేటు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బినామీ స్కామ్ జరిగినా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇప్పటి వరకూ బయటకు వచ్చింది. మిగిలిన జిల్లాల్లో కొందరు అధికారులు విచారణల పేరుతో విషయాన్ని బయటకు రానీయలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
పంపకాల వద్ద తేడాలే బెడిసి కొట్టాయా..
గ్రామ సచివాలయశాఖలోని వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది చేసిన ఈ అవినీతి విషయంలో జిల్లా అధికారులు, మండల అధికారులకు సిబ్బంది చేసిన చేతి వాటంలో ఇచ్చే పర్శంటేజీలు కుదరకే జరిగిన భారీ స్కామ్ బయటకు వచ్చినట్టుగా కూడా చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ స్కాము బయటకు రానీయకుండా మీడియా ప్రతినిధులు కూడా తలో కొంత పుచ్చుకున్నారనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది. అలా విషయాన్ని బయటకు రానీయకుండా ఉండేందుకు మీడియాకు కూడా వారు చేసిన అవినీతిలో రెండుశాతం మొత్తాన్ని బినామీ పేర్లతో అవినీతికి పాల్పడిన సిబ్బంది ఖర్చు చేసి ముడుపులు ఇచ్చారని..దానికోసమే చాలా జిల్లాల నుంచి అవినీతి జరిగిన విషయం బయటకు రాలేదని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో అధికారులు జరిగిన మోసం, అవినీతిని బయటపెట్టిన తరువాత మీడియాకూడా ఏమీ తెలియనట్టుగా అధికారులు చెప్పింది రాస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కొన్ని చోట్ల అవినీతికి పాల్పడిన సిబ్బందిని కాపాడేందుకు పర్శంటేజీలు తీసుకున్న మీడియా వెనుకేసుకు వచ్చే ప్రతయత్నాలు.. విచారణ జరగుతున్న సమయంలో హడావిడి కూడా చేస్తుందనే ప్రచారం గుప్పుమంటోంది.
ఈ భారీ అవినీతికి దూరంగా స్థానిక ఎమ్మెల్యేలు..
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖల్లో బినామీపేర్లతో గ్రామ సచివాలయ సిబ్బంది నొక్కేసిన ఈ అవినీతి వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేల ద్రుష్టికి వెళ్లినా.. తాము కూడా అవినీతిలో భాగం పంచుకున్నట్టు ప్రభుత్వం ద్రుష్టికి, ఇంటెలిజెన్సు అధికారుల ద్రుష్టికి వెళితే వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కవని ముందుగానే గ్రహించిన చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. తప్పుచేసిన అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ద్రుష్టికి విషయాన్ని తీసుకెళ్లి చేసిన తప్పుని మాఫీ చేయాలని భారీ ఎత్తున రాయబారాలు నడిపినా..ఆ బురదను తమకు అంటించవద్దని చాలా మంది అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మూడు శాఖల అధికారులకు, అవినీతికి పాల్పడిక సిబ్బందికి మొహం మీదే చెప్పేసి.. వెనక్కు పంపేసినట్టుగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ సీటు రాదని, ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోయిన ప్రజాప్రతినిధులు మాత్రం కొన్ని జిల్లాల్లో గ్రామసచివాలయశాఖ సిబ్బంది చేసిన తప్పును కప్పి పుచ్చేందుకు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పుడిప్పుడే జనాల్లోకి తీసుకెళుతున్నారని సమాచారం అందుతోంది.. ఏది ఏమైనా.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశం మొత్తం తొంగిచూసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇంత పెద్ద స్థాయిలో మూడు శాఖలకు చెందిన సిబ్బంది అవినీతికి పాల్పడటం, అది కాస్త పెద్ద రచ్చ జరగడం నిజంగా అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా కొందరు అధికారులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారంతా కూడా ఈ భారీ స్కాములో భాగస్వాములుగా మారే ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్టుగా చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది సిబ్బంది చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతే లోలోన దాగిన మరింత అవినీతి బయటకు వచ్చే అవకాశాలున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.. చూడాలి ఈ విషయంలో ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందోనని..!