తిరుమల శ్రీవారిని గురువారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గవర్నర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అందించారు. ఈ కార్యక్రమంలోసివిఎస్వో నరసింహకిషోర్, డెప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, హరేంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.