సుందరకాండ పారాయణంలో పాల్గొన్న సీఎంలు..
Ens Balu
3
Tirumala
2020-09-24 12:05:29
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, బి.ఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం శ్రీవారి దర్శనానంతరం సుందరకాండ పారాయ ణంలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ 168 రోజులుగా నాదనీరాజనం వేదికపై టిటిడి పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సుందరకాండ పారాయణం గురువారం నాటికి 106వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని, పండితులు డా. ఆకెళ్ల విభీషణశర్మ కలిసి శ్లోక పారాయణం చేసి వాటి విశిష్టతను వివరించారు. ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గురజాడ మధుసూదనరావు బృందం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన బ్రహ్మమొక్కటే... సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరగా శ్రీహనుమా.. జయహనుమా .. అనే సంకీర్తనను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ ఆర్కె.రోజా, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, అర్బన్ ఎస్పీ ఎ.రమేష్‌రెడ్డి పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.