ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్ధానంలో పెళ్లిళ్లకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. సుమారు 18 రకాల పెళ్లి మండపాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎవరికీ ఒక్క పైసాకూడా అధికంగా
చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా సీఆర్వఓ కార్యాలయాన్ని సంప్రదించి వివాహ శుభకార్యాలకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. అద్దె మండపాలు వాటికి నిర్ణయించిన ధరలు ఒక్కసారి తెలుసుకుంటే..1)శ్రీ సీతారామ చౌల్ట్రీ హాల్(2) ఒక రోజుకి అద్దె ధర రూ.5వేలు, 2)శ్రీ సీతారామ స్టేజి (1) రూ.5వేలు, 3)ప్రకాస్ సదన్ కేంటీన్ హాల్(1) రూ.15వేలు, 4)ప్రకాష్ సదన్ సౌత్ రోడ్డు(1) రూ.25వేలు, 5) ప్రకాష్ సదర్ నార్త్ రోడ్డు(1) రూ.15వేలు, 6)వాయువ్య వ్రత మండపం(1) రూ.50వేలు, 7)నైరుతి వ్రత మండపం(1) రూ.50వేలు, 8)విష్ణు సదన్ హాలు పెద్దవి(12) రూ.5వేలు, 9)విష్ణు సదన్ హాలు చిన్నవి(26) రూ.3వేలు, 10) విష్ణు సదన్ హాలు సెల్లార్(1) రూ.4వేలు, 11)ఓల్డ్ సిసి స్టేజ్(2)రూ.5వేలు, 12) న్యూ సిసి స్టేజి(1) రూ.10వేలు, 13)ఓల్డ్ కళ్యాణ మండపం 1, 2(రూ.35వేలు), 14) హరిహర సదన్ పార్కింగ్ ప్లేస్ రూ.25వేలు, 15)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు)(7)రూ.3వేలు, 16)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 1,2,3,6)రూ.వెయ్యి, 17)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 4, 5)రూ.700, 18) సత్యనికేతన్ చౌల్ట్రీ బ్యాక్ సైడ్(1)రూ.1500