ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచంటే..


Ens Balu
10
Tadepalli
2023-02-18 12:46:47

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీలను ఫిక్స్ అయ్యాయి. ఈ నెల 27, 28 రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. అలాగే రెండో రోజు సంతాప తీర్మానాలు, తర్వాత సభ వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, మొత్తం 13 పని దినాల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించి నిరధికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం భావించింది. ఈఎన్నికల ప్రచార సమయం పూర్తికాగానే మళ్లీ తిరిగి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులు నిలబడ్డ స్థానాల్లో గట్టి పోటీనే ఉంది.
సిఫార్సు