టీవి9లోగో విషయమా.. నిజంగా అకౌంట్స్ చూడటానికేనా..?


Ens Balu
293
Hyderabad
2023-02-21 08:32:09

టీవి9 భాగస్వామిల్లో ఒకరిగా సంస్థల్లో అకౌంట్స్ చూడటానికి కార్యాలయానికి వచ్చానని మాజీ సీఈఓ రవిప్రకాష్ అన్నారు. మంగళవారం హైదరాబాదులోని టివి9 కార్యాలయానికి వచ్చిన ఆయన బయట మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థలో నలుగురు భాగస్వాములు ఉన్నారని అన్నారు. టివి9తో, పాటు ఏబిసిఎల్ సంస్థలు నడుస్తున్నాయన్నారు. వాటి అకౌంట్స్ ను చూడటానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. కాగా ఛానల్ లోగోకి సంబంధించిన చర్చలు లోన జరిగాయని ప్రశ్నించిన జర్నలిస్టులకి అంతా మనకి అనుకూలంగానే జరుగుతోందని సమాధానం ఇచ్చారు. చాలా రోజుల తరువాత మళ్లీ టివి9 కార్యాలయంలో రవిప్రకాష్ కనిపించడంలో పాత టివి9 లోగో విషయంలోనే మళ్లీ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం గట్టిగా సాగింది. మరోపక్క రవిప్రకాష్ ఆర్ టివి అనే న్యూస్ ఛానల్ ను ఎస్టాబ్లిస్ చేశారు. ఇప్పటికే అన్నిజిల్లాల్లో నియామకాలు కూడా పూర్తయ్యాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకున్నాకే లోనికెళ్లారు.  ప్రస్తుతం ఈవిషయం చర్చనీయాంశం అవుతోంది.
సిఫార్సు