ఇకపై తెలంగాణ-ఒడిసా మధ్య తెలంగాణ ఆర్టీసులు నడవనున్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల మధ్య పరస్పరం బస్ సర్వీసు లు నడిపేందుకు ఆయా రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. టీఎస్ఆర్టీసీ 10 సర్వీసులు నడిపితే ఓఎస్ఆర్టీసీ 13 సర్వీసులు తెలంగాణకు నడపనుంది. హైదరాబాద్-జైపూర్ 2, ఖమ్మం-రాయగఢ్ 2, భవానీపట్నం-విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్ 4 బస్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. చాలా కాలం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడపాలని భావిస్తున్నప్పటికీ వీలు పడలేదు. దానికితోడూ ఒడిసా నుంచి చాలా మంది తెలంగాణకు వివిధ పనులపై నిత్యం వెళుతుంటారు. అలాంటివారికి ఇప్పటి వరకూ రైళ్లు, కొన్ని ప్రైవేటు బస్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా ఒడిసా, తెలంగాణ ఆర్టీసీల మద్య ఒప్పందం కుదరడం లో రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమం అయ్యింది.