టీటీడీ యాప్ లో పంచగవ్య ఉత్పత్తుల సమాచారం


Ens Balu
7
Tirumala
2023-02-27 14:18:03

టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల గురించి టీటీడీ వెబ్సైట్ లోనే కాకుండా ఇటీవల రూపొందించిన యా ప్ లో కూడా సమాచారం పొందుపరచాలని ఈవో  ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదా రులకు సులువుగా చేరువ కావచ్చునని ఆయన తెలిపారు.  తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష జరిపా రు. 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల్లో 10 ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు ఈవో దృష్టికి  తెచ్చారు. వీటిని  మరిం త ఎక్కువగా  వినియోగదారులకు చేరవేయడానికి ,ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో  చెప్పారు.టీటీడీ ఆలయాల్లో వినియో గించిన పుష్పాలతో తయారు చేస్తున్న ఫొటో ఫ్రేమ్ లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వివిధ సైజులు, ఫ్రేమ్ లతో తయారు చేసిన వాటి వెనుక వైపు ఈ ఉత్పత్తి గురించిన పవిత్రత,ప్రాముఖ్యతను అర్థమయ్యేలా ముద్రించాలన్నారు. వీటిపై గణాంక శాఖ అధికారులు సమీక్ష చేయాలని ఈవో సూచించారు.

       అంతకు ముందు తిరుమల , తిరుపతిలో పరకామణి అంశంపై ఈవో సమీక్ష జరిపారు. నాణాలు వివిధ బ్యాంకులకు క్రమ పద్దతిలో పంపే ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు ఏ రోజు నాణాలు ఆరోజు తీసుకుని వెళ్ళేలా ఉన్న వ్యవస్థను మరింత ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని శ్రీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. నాణాలు నిల్వ ఉండకుండా ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.  జేఈవో సదా భార్గవి, ఎఫ్ ఎ సీఏవో  బాలాజి, పరకామణి ఎఈవో  రాజేంద్రతో పాటు పలువురు అధికారులు  పాల్గొన్నారు.