ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈనెల 19 నిర్వహించిన ఎస్ఐ ప్రలిమినరీ పరీక్షలో 57, 927 మంది అర్హత సాధించారు. మొత్తం 1,51,288 మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. అభ్యర్ధుల ఓఎంఆర్ షీట్లను మార్చి 4వ తేదీ వరకూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పరీక్ష లకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీని విడుదల చేసింది. ఆ సమయంలోనే అభ్యర్ధులు తమ ప్రిలిమినరీ పరీక్ష ఏవిధంగా రాశారో పరీక్షించు కున్నారు. అదే కీతో నేడు ఫలితాలు విడుదల అయ్యాయి. https://slprb.ap.gov.in/ అనే వెబ్ సైట్ లో రిజల్ట్స్ ను పొందు పరిచారు. అభ్యర్ధు లు నేరుగా వారి రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ క్రింద కాలమ్ లోనే అభ్యర్ధుల ఓఎంఆర్ షీట్లు కూడా డౌన్ లోచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అర్హత సాధించిన వారంతా ఫిజికల్ టెస్టుకు అర్హత సాధిస్తారు. అందుతో కూడా అర్హత సాధిస్తే ఎస్ఐ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో ఏ ఒక్క పరీక్ష తప్పినా వారు ఈ ఎంపిక ప్రక్రియ నుంచి తప్పుకోవాల్సిందే.