విశాఖలో రుషికొండను నామరూపాలు లేకుండా చేసి ఏమాచర్చడానికి, అడ్డదారిలో అనుమతులు తేవడం కోసమే ఆఘమేఘాలపై జివిఎంసీ కమిషనర్ ను మార్చినట్టు ప్రణాళిక మార్పుతో తేటతెల్లమైంది. నిర్మాణాలు ప్రారంభానికి ముందు ఏపనులకైనా అనుమతి ఇచ్చే జివిఎంసీ 61 ఎకరాల్లో దాదాపు నిర్మాణాలు పూర్తయిన తరువాత రుషికొండ వద్ద చేసేస్తున్న పనులకు అనుమతి ఇవ్వడాన్ని బట్టి ఏస్థాయిలో అడుగులు వే స్తున్నరో తెలుసుకోవచ్చు. తొలిప్లాన్ లో 2.88 ఎకరాలకే అనుమతి ఇచ్చినట్టు కోర్టుకి నివేదించింది ప్రభుత్వం. ఏపీ టూరిజం ఎస్ఈ కె.రమ ణ జివిఎంసికి పంపిన మొదటి ప్లానులో 12.46 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో కేసు వేయడంతో 2.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఏకంగా కొత్త ప్లాన్ లో 61. 03 ఎకరాల్లో నిర్మాణాలకు జివిఎంసీ అనుమతులు ఇచ్చేయడం చర్చనీయాంశం అవుతోంది..!